Latest

Monday, November 11, 2024

Purva Janma Runaanubandhamu | పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు

Purva Janma Runaanubandhamu


Dear All, here are the details about "Purva Janma Runaanubandhamu | పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు " ఋణానుబంధం :-


పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు... !


✨ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


✨ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.


✨ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


✨మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


✨ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


✨మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


✨మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


🌹ఉదాహరణకు ఒక జరిగిన కథ...

 

Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం


Purva Janma Runaanubandhamu | పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు


✨కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


✨తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


✨ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు.


✨పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని..

Purva Janma Runaanubandhamu | పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు 


✨అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

 
 



✨ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని.


✨ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


✨నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


✨ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


✨ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...

#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


✨కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


✨అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము...


✨ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు...


💥ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టుముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?''


✨అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. ''తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు. అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ కల వాడిని. ఈ రక్షక భటులు నన్ను కాపాడటానికీ వీరంతా నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు''.


💥ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్ధకర్మల్లాంటి వాళ్ళు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కాని రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్ధకర్మల్లాంటి వారు. నిస్వార్ధ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు.


✨త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది.


💥''చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు.''

 


✨ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. ''వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి నేను మాత్రంబలంగా ఇక్కడే ఉన్నాను''. 



#ఋణానుబంధం:-

Debt bonds we had in previous life...!


✨In order to repay the debt we have in the previous life, as wife, husband, children, parents, friends, servants, cows, oxen, dogs, etc. will be longing for some kind of relationship in this life...


✨The debts that are given and received will be washed away or will die. If we understand this matter very well, we will not be interested in the relationships that we develop in our lifetime.


✨How will our debts be with other beings...


✨In the previous birth, whether we have taken free money, goods, or free service from someone, in order to pay off that debt, in this birth, we long to be a wife, a child, and a servant with us.


✨Hatred is also a relationship, in order to take revenge on us in the previous life, they may be thirsty for us in this life as an owner or child who tortures us...


✨In order to take revenge for the misfortune we have done, in this life, we will face as enemies, supporters, or those who do bad to us in some way.


✨In this life, to do a favor instead of the favor we have done, we will face as friends or helpers...


The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html

🌹 A story that happened for example...


✨A lame beggar who was begging near the temple of Mookambika in Kolluru used to beg from morning six to night ten. In that profession, he would earn more than ten thousand per month. But if he lived a comfortable life, he would have lived a normal life that would not beg, sleeping in someone's bed on the roadside, eating free meals provided by Mother Mookambika's temple, and wearing torn clothes.


✨M with his earnings two sons. .. .. Yes is reading.


✨ Once a great man who visited Mookambika mother saw that beggar and said this.


✨In his previous life, he took money from two people and when they were in deep pain, he was not even in a position to give. That's why in this life he is earning hard, he is suffering and educating them to pay their debt. ..നി..


✨A story that proves that even the small mistakes that we do knowingly or unknowingly also become a bond to us...


✨Orphaned children are fighting street dogs for the spreads that were eaten and thrown away in the trash can outside the guest house where Maharshi once stayed. After seeing that, some devotees asked Swami sadly, Swami what is the reason for this horrible situation.


✨All these children misused food in their previous lives, so they are looking for food in this life, said Swami.


✨If you misuse water, you will be born in the desert. Maharshi said that whichever resources are misused, the consequences will have to be suffered for sure...


✨If Sri Vidya Prakashanandagiri Swamy goes to Bandar and takes the permission of his teacher Sri Malayala Swamy, if he calls you back and asks what is your handbag, he will say that it is in the hand of a friend next to you. At that time Malayala Swamy said that if you carry a sack by your friend in this life, you will have to carry his rice sack in the next life.


✨We do a lot of things like this knowingly or unknowingly, whatever we receive freely from others through kindness, gratitude, respect or any other reason binds us in the cycle of birth and death...


✨Taking things like pens from newcomers, carrying our boxes, telling the neighbor to bring me fruit when they go to the shop, are in many cases taking others services for free.


✨Not knowing that they will be karma bonds, we will be trapped in thousands of such karma relationships in our lifetime...


✨Just as dangerous as the poison of six feet rattlesnake is, and the venom of an inch rattlesnakes is also, and no matter how big or small the karma is, its consequences will be there for it and not disappear...


💥Went to one place and saw some security guards surrounding a thief. After going further, a king saw some saviors around. He stopped and questioned the king. '' The King! These are the security guards around the thief. You are surrounded by saviors too. What is the difference between that thief and you? ''


✨That's why the king smiled and replied. "He is a thief prisoner with protective arms around him. They were making sure he didn't run away. I am a dreamer of freedom. These saviors are all around me to protect me. If I leave, they leave''.


💥Those saviour bhutulu karma. Those who do not run away from the thief and make him punished for his crimes are selfish people. Selfish karma binds us. But the saviors around the king are like selfless people. Selfless karma protects a man but cannot imprison him.


✨A fast-growing Lata, clinging to the stem of a coconut tree and said it proudly with that coconut tree.


💥''Look, how fast I grew up and I was all grown up yesterday? And who are you? Didn't grow an inch. ''


✨The coconut tree smiled and replied. "Thousands of lathas have the same word with me. They went to the wind and I'm just here as a pillar''. 

 


Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 


Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 




Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 





No comments:

Post a Comment

Powered by Blogger.