Latest

Friday, November 22, 2024

Good Moral Stories | మంచి నీతి కథలు కావాలి | రాక్షసి పిల్ల కథ

Good Moral Stories | మంచి నీతి కథలు కావాలి | రాక్షసి పిల్ల కథ 


Dear All, here we will find Good Moral Stories - Rakshasi Pilla Telugu Lo Stories Kathalu | రాక్షసి పిల్ల కథ


వింధ్య పర్వతాల్లో ఒక దట్టమైన అడవి ఉండేది. కాకులు దూరని ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు తరతరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండేవి. ఆ అడవి మధ్యలో ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సుకు దగ్గరగా ఉన్న గుహలో ఒక రాక్షసి, తన పిల్లతో సహా నివసించేది. ఈ రెండూ చాలా మంచివి. ఏనాడూ ఒక్క ప్రాణికి కూడా అపకారం చేసి ఎరుగవు.  మిగిలిన జంతువుల లాగే, వాటి మానాన అవి జీవిస్తూ ఉండేవి. పిల్ల రాక్షసికి తను పుట్టిన ఆ అడవి అన్నా, అక్కడి వాతావరణం అన్నా చాలా ఇష్టం. అమ్మ రాక్షసికి తన పిల్ల అంటే ప్రాణం.
 

ఒకసారి పిల్ల రాక్షసి సరస్సు ఒడ్డున కూర్చొని, కాళ్ళు నీళ్ళలోకి చాపుకొని ఆడుకుంటున్నది, రోజూలాగే. చుట్టూ వాతావరణం బాగున్నది- వసంతం వచ్చింది. పూలు వికసించి, గాలికి ఊగుతున్నై. పక్షులు కువకువలాడుతున్నై. ప్రకృతి సోయగాలను చూస్తున్న పిల్లరాక్షసి మైమరచి పోతున్నది.

అకస్మాత్తుగా తన మీద ఏదో నీడ పడినట్లై, వెనక్కి తిరిగి చూసింది అది- అక్కడో వింత ప్రాణి నిలబడి ఉన్నది, తనకేసే చూస్తూ. రెండు కాళ్ళు- రెండు కాళ్లమీద నిలబడి ఉన్నదది, అచ్చం రాక్షసుల లాగే. కానీ దాని తలమీద కొమ్ములు లేవు- ఏదో కప్పుకొని ఉన్నది. కోరలు లేవు- నోటి లోపలికే పోయినట్లున్నై, మరి. 

Good Moral Stories | మంచి నీతి కథలు కావాలి | రాక్షసి పిల్ల కథ



రంగులు రంగులుగా ఉంది, దాని చర్మం- వెంట్రుకలూ లేవు, పొలుసులూ లేవు! చేతిలో పొడుగాటి కట్టె పట్టుకొని, అది క్రూరంగా చూస్తున్నది తనవైపే.

పిల్ల రాక్షసికి భయం వేసింది. గబుక్కున లేచి నిలబడి దానివైపే చూస్తూ కదలకుండా ఉండిపోయింది ఒక్క క్షణం. 

ఆ సమయంలో వింత ప్రాణి ""హే..య్"" అని అరిచింది. వెంటనే దాని దగ్గరున్న కట్టెలోంచి ""టు..శ్..శ్..ష్"" అని శబ్దం చేస్తూ ఏదో దూసుకొచ్చింది రాక్షసి పిల్ల మీదికి. రాక్షసి పిల్ల ఒక్క ఉదుటున ప్రక్కకు దూకి, ఎటు పడితే అటు పరుగు తీసింది.


వింతజీవి దాని వెంట పడింది, అరుచుకుంటూ. దాని చేతిలో ఉన్న కట్టె ఆగి ఆగి ""టు..శ్..శ్..ష్"" అని శబ్దం చేస్తున్నది. రాక్షసి పిల్ల ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసింది, వింతజీవికి అందకుండా పొదలలోకీ, తుప్పలలోకీ పరుగెత్తిపోయింది.

Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం


అలా పరుగెత్తుతుంటే దానికి ఏనుగు ఎదురైంది. ""కాపాడు, కాపాడు. ఏదో వింతజీవి, రెండు కాళ్లమీద వెంటపడుతోంది. ""టుష్.."" మని శబ్దం చేస్తోంది"" అన్నది పిల్లరాక్షసి, వగరుస్తూ. అంతలో ""ఏ...య్! ఎక్కడున్నావు నువ్వు? నానుండి తప్పించుకు పోలేవు! టుశ్....ష్"" అని శబ్దం వచ్చింది వెనకవైపునుండి. 

""అమ్మో, మనిషి!"" అని అంతలావు ఏనుగూ పరుగులు పెట్టి, ఒక్క క్షణంలో కనుమరుగైంది. పిల్ల రాక్షసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే సరికి వింతజీవి దగ్గరకొచ్చేసింది! పిల్ల రాక్షసి పరుగు మళ్ళీ మొదలైంది.


చాలా దూరం పరుగెత్తాక దానికి ప్రాణాలు కడబట్టినట్లై, ఒక ప్రక్కగా ఆగింది. అక్కడ ఓ చెట్టుమీద ఒక చిరుతపులి కునుకు తీస్తున్నది. పిల్లరాక్షసిని అది ఆప్యాయంగా పలకరించింది. ""ఏదో వింత జీవి- మనిషట, నావెంట పడింది. కాపాడు, కాపాడు"" అని పిల్లరాక్షసి అనగానే అది దబ్బున నేలమీద పడింది-""అమ్మో, మనిషా!?"" అని అరిచి, వంకరదారుల వెంట, తుప్పల మీదినుండి దూకుతూ పరుగు పెట్టింది.


Rakshasi Pilla Telugu Lo Stories Kathalu | రాక్షసి పిల్ల కథ


 
రాక్షసిపిల్లకు ఆయాసంతోటీ, భయంతోటీ ఊపిరాడనట్లౌతున్నది. అయినా ఆగేందుకు లేదు- ఏనుగునూ, చిరుతపులినీ భయపెట్టిన ఆ ప్రాణి సామాన్యమైనది కాదు! దాని పాలబడితే తన గతి ఏమౌతుందో- ఊహించుకుంటేనే దానికి వణుకు పుట్టింది.


అలా అది సింహాన్నీ, పెద్దపులినీ, తోడేళ్లనీ, నక్కల్నీ కల్సి ""కాపాడమని"" మొర-పెట్టుకున్నది. ఏ జంతువుల్ని కలిస్తే అవల్లా- ""మనిషా!"" అని ప్రాణం పోయినట్లుగా అరిచేవి; లేచి, ఒక్క ఉదుటున పారిపోయేవి!

అలా పరుగు తీసీ పరుగు తీసీ చివరికి పిల్ల రాక్షసి తమ గుహనే చేరుకున్నది. గుహలో తల్లి రాక్షసి గురక పెట్టి నిద్రపోతున్నది. పిల్లరాక్షసి వెళ్ళి ""ఓయమ్మో, కాపాడు, కాపాడు"" అని మొత్తుకోగానే అది లేచి, ""ఏమైందే"" అని అడిగింది, బద్ధకంగా. ""ఎవరో మనిషట, నా వెంట పడ్డాడు. ""ఏ..య్.టు..శ్..శ్..ష్"" అని అరుస్తున్నాడు. అన్నది రాక్షసి పిల్ల.

తల్లి రాక్షసి ఆవులించింది. ""మనిషి మనకు భయపడాలి గాని, మనం వాడికి భయపడేదేంటి?"" అన్నది ఒకింత చికాకుగా. ""అందరికీ అదంటే భయమేనే, నా వాసన పట్టినట్లుంది, నా వెంటే వస్తున్నది, వెతుక్కుంటూ"" అన్నది పిల్ల రాక్షసి, తల్లిని కావలించుకుంటూ. ""ఏం పర్లేదులే, నేను వస్తాను గదా, పద!"" అని, తల్లి రాక్షసి దాన్ని బుజ్జగించి బయటికి తీసుకెళ్ళింది.

Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


ఇవి వెళ్ళే సరికి, మనిషి అక్కడ సరస్సు దగ్గర నిల్చొని 'ఏ జంతువును చంపుకెళ్దామా' అని ఎదురుచూస్తున్నాడు.

తల్లి రాక్షసి వాడిని చూసీ చూడగానే పెడబొబ్బలు పెట్టుకుంటూ ఒక్క ఉదుటున వాడి పైకి దూకింది. ఆ పొలికేకకు వాడికి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చినట్లైంది. 

ఇప్పుడిక పారిపోవటం వాడి పనైంది. వాడు ముందు పరుగెత్తుతుంటే, తల్లి రాక్షసి, పిల్లరాక్షసి వాడి వెంటపడి తరిమి, తరమటంలోని ఆనందాన్ని చవి చూశాయి!

ఆ తరువాత తల్లి రాక్షసి పిల్లకు- చూడమ్మా, "మనం దేనికీ భయపడకూడదు- భయపడితే అలుసైపోతాం. ఆ తర్వాత లోకం మనల్ని వశం చేసుకుంటుంది. అందుకని, అవసరాన్ని బట్టి లోకాన్ని భయపెట్టాలి తప్ప, మనం మాత్రం ఎప్పుడూ భయపడరాదు" అని ఉపదేశించింది.


 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 

#storyintelugu​​​ #storiesintelugu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #telugulostories

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


 Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Good Moral Stories | మంచి నీతి కథలు కావాలి | రాక్షసి పిల్ల కథ


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 

There was a dense forest in the Vindhya Mountains. In that forest, where crows were not far away, many animals and birds had settled for generations. In the middle of that forest, there was a lake. In a cave near that lake, a demon lived with her child. Both of them were very good. They never harmed a single living being. Like other animals, they lived according to their own rules. The little demon loved the forest where she was born and the atmosphere there. The mother demon loved her child.


Once, the little demon was sitting on the bank of the lake, stretching her legs in the water, playing, as usual. The weather was good around her - spring had arrived. Flowers were blooming and swaying in the wind. Birds were chirping. The little demon was mesmerized by the beauty of nature.


Suddenly, a shadow fell on her, and she turned around - there was a strange creature standing there, looking at her. Two legs - it was standing on two legs, just like a monster. But there were no horns on its head - it was covered with something. There were no fangs - they seemed to go inside its mouth, and so on.


Good Moral Stories | Good Moral Stories Needed | The Story of a Baby Monster


It was colorful, its skin - no hair, no scales! Holding a long stick in its hand, it was looking at her cruelly.


The baby monster was scared. It stood up, stood up, and looked at it, motionless for a moment.


At that moment, the strange creature shouted ""Hey..y"". Immediately, something rushed from the stick near it, making a ""To..sh..sh..sh"" sound, and rushed at the baby monster. The baby monster jumped to the side with one step and ran away.


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 


The strange creature ran after it, screaming. The stick in its hand stopped and made a ""t...sh...sh"" sound. The baby monster ran without looking back, and ran into the bushes and bushes to avoid the strange creature.


While running like that, an elephant came across it. ""Guard, guard. Some strange creature is chasing it on two legs. ""tush.."" sounds like a man"" said the baby monster, croaking. At that moment, a sound came from behind, ""E...y! Where are you? You can't escape me! Tush...sh""


""Oh, man!"" said the elephant, running away and disappearing in an instant. When the little monster looked back, the strange creature was approaching! The little monster started running again.


After running for a long distance, it stopped to one side, as if it was dying. There, a leopard was taking a nap on a tree. It greeted the little monster affectionately. ""Some strange creature - a human, has come after me. Save me, save me"" said the little monster, and as soon as it said it fell to the ground in a panic -""Oh, human!?"" it shouted, and started running along the winding paths and jumping over the culverts.


Rakshasi Pilla Telugu Lo Stories Kathalu | Rakshasi Pilla Katha


The little monster was gasping for breath due to exhaustion and fear. But there was no stopping it - that creature that had frightened the elephant and the leopard was no ordinary one! It shuddered to think what would happen to it if it were to fall into its trap.


So it called out to the lion, the tiger, the wolf, and the jackal, ""protect me."" Every animal it encountered would scream, ""Human!"" as if it had lost its life; it would get up and run away with a single bound!


The Cunning Tiger Moral Story | చతురంగా ఉన్న పులి https://friendshipstoriesforkids.blogspot.com/2024/11/the-cunning-tiger-moral-story.html


So it ran and ran until the baby demon finally reached its cave. In the cave, the mother demon was snoring and sleeping. As soon as the baby demon went and called out, ""Oh my, protect me, protect me,"" it got up and asked, lazily. ""Someone, a human, has come after me. ""Oh..you..sh..sh..sh"" was the demon baby.


The mother demon yawned. ""Man should be afraid of us, but why should we be afraid of him?"" he said a little annoyed. ""Everyone is afraid of him, he seems to smell me, he's following me, looking for me"" said the baby demon, looking for his mother. ""What's the matter, I'll come, Pada!"" said the mother demon, soothing him and taking him outside.


When they left, the man was standing there by the lake, waiting, 'Which animal should we kill?'"


As soon as the mother demon saw him, she jumped on him with a single lunge, making a noise. That scream sent a chill down his spine.


Now it was his turn to run away. As he ran ahead, the mother demon and the baby demon chased after him, experiencing the joy of the chase!


Then the mother demon said to the baby, "Look, we should not be afraid of anything - if we are afraid, we will become exhausted. Then the world will take control of us. Therefore, we should never be afraid, unless we have to scare the world out of necessity."



Friendship Stories for Kids, Moral Stories for Kids, Telugu Stories for Kids, Deyyam Stories for Kids, Inspirational Stories for Kids, Funny Friendship Stories, Adventure Stories for Kids, Bedtime Stories for Kids, Animal Friendship Stories, Cultural Stories for Kids, Telugu Educational Stories for Kids, Classic Friendship Tales, Life Lessons for Kids, Short Stories for Kids, Storytelling for Kids, 



#FriendshipStoriesForKids, #MoralStoriesForKids, #TeluguStoriesForKids, #DeyyamStoriesForKids, #InspirationalStoriesForKids, #FunnyFriendshipStories, #AdventureStoriesForKids, #BedtimeStoriesForKids, #AnimalFriendshipStories, #CulturalStoriesForKids, #EducationalStoriesForKids, #ClassicFriendshipTales, #LifeLessonsForKids, #ShortStoriesForKids, #StorytellingForKids 


Short telugu moral stories on friendship

Telugu moral stories on friendship pdf

Telugu moral stories on friendship in english

Telugu moral stories on friendship for students

Telugu small Story with Moral 

Read Also : Latest Bahrain Bus and Timing Information  https://bahrainbus.blogspot.com/


Friendship stories in telugu pdf

Telugu Moral Stories for Project work

Moral Friendship Stories in Telugu wikipedia

No comments:

Post a Comment

Powered by Blogger.